నేడు భారత్ బంద్.. ఢిల్లీలో భారీ భద్రత

-

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా గతేడాది సెప్టెంబరు 26వ తేదీ నుండి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన జరుగుతుంది. ఇప్పటి వరకు ట్రాక్టర్ ర్యాలీలు, భారత్ బందులు నిర్వహించిన రైతు సంఘాలు, తాజాగా మరోసారి భారత్ బందుకు పిలుపు ఇచ్చాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, వాటివల్ల రైతులు నష్టపోతారని, అవి కేవలం వ్యాపారులకు లాభం చేకూర్చడానికే అని, అందువల్ల రైతు చట్టాలను రద్దు చేయాలని, అప్పటి వరకు నిరసన కొనసాగుతుందని కిసాన్ మోర్చా తెలిపింది.

రైతు సంఘాలు నిర్వహిస్తున్న ఈ భారత్ బందు సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. ఈ బందుకి బ్యాంకులు, బ్యాంకు యూనియన్లు, కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు భారత్ బందుకు తమ పూర్తి మద్దతు తెలియజేసాయి. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దులో నిరసన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం భారత్ బంద్ కారణంగా ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version