మంగళూరు యూనివర్సిటీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలో ముస్లిం విద్యార్థినులు ధరించే బుర్కాపై నిషేధం విధించింది. యూనివర్సిటీ ప్రాంగణంలో, తరగతి గదుల్లో ఎక్కడా ముసుగు ధరించి కలిపించకూడదని ఆదేశాలు జారి చేసింది. ఈ నియమం మంగళూరు యూనివర్సిటీతోపాటు ఆరు అనుబంధ కాలేజీలకు వర్తిస్తుందని వెల్లడించింది.
అయితే ఈ నిర్ణయంపై ఇటు అధ్యాపకుల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే ఇటీవల ముస్లిం విద్యార్థినులకు యూనిఫాంకు చెందిన షాలువాతో ఫేస్ కవర్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఆ వెసులుబాటును కూడా ఈ నెల 16వ తేదీన తొలగించింది. యూనివర్సిటీ, కాలేజీ ప్రాంగణంలో ఎవరూ తల, ముఖానికి ముసుగు ధరించకూడదని తీర్మానించింది.
అయితే ప్రస్తుతం యూనివర్సిటీలో 44 మంది ముస్లిం విద్యార్థినులు ఉన్నారు. వీరిలో 10 మంది విద్యార్థినులు మాత్రమే హాజరవుతున్నారు. మిగిలిన వాళ్లను కూడా యూనివర్సిటీకి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు యూనివర్సిటీ నిర్ణయంపై ముస్లిం విద్యార్థినులు మండిపడుతున్నారు. కాగా, ఈ నిర్ణయంపై ముస్లిం విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.