ట్రెండ్ ఇన్: మరో అద్భుత ప్రపంచానికి అడుగులు..ProjectKపై పెరుగుతున్న అంచనాలు

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్..‘బాహుబలి’ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే పిక్చర్స్ అన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజెస్ అవుతుండటం విశేషం. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ప్రభాస్ తన స్క్రీన్ ప్రజెన్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారని అభిమానులు అంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్స్ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. ఈ తరుణంలో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె అప్ డేట్ వచ్చేసింది. #ProjectKలో మరో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ అవుతున్నట్లు స్పష్టమైంది. యంగ్ అండ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఈ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ లో భాగమవుతోంది.

ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ నుంచి తనకు ఆహ్వానం అందిందని దిశా పటాని తెలిపింది. ఈ క్రమంలోనే సినీ అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ #ProjectK ప్రాజెక్ట్ కె హ్యాష్ ట్యాగ్ ను వరుసగా ట్వీట్ చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ మై క్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రాజెక్ట్ కెలో బాలీవుడ్ స్టార్స్ అమితా బ్ బచ్చన్, దీపికా పదుకునే నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సినీ అభిమానులందరినీ మరో అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా #ProjectKపైన రోజురోజుకూ అంచానాలు ఇంకా పెరుగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version