SamChay Divorce: పెళ్లికి ముందే సామ్ – చైతూల మ‌ధ్య‌ ఒప్పందం !

-

SamChay Divorce: గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నాగచైతన్య-సమంతల జంట నిజం చేసింది. ఏడేళ్లు ప్రేమించుకున్నసామ్ చైతూలు పెద్దలను ఒప్పించి, 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం చేసుకున్నారు. అనూష్యంగా ఉన్న ఈ జంటను చూసి టాలీవుడ్ లో కుల్లుకున్న ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఆ జంట మీద నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా షాకిచ్చారు.

నాలుగేళ్లు గడవక ముందే ఆ జంట‌.. త‌మ వివాహబంధానికి పుల్ స్టాఫ్ పెట్టేసింది. శ‌నివారం నాడు సోష‌ల్ మీడియా వేదికగా నాగ చైతన్య‌- స‌మంత‌లు.. త‌మ‌ విడాకుల విష‌యాన్ని ప్రకటించారు. తామిద్దరం విడాకులు తీసుకోనున్నమ‌ని, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాల‌ని అనుకున్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఓ టాక్ వినిపిస్తుంది. పెళ్లికి ముందే వారి మ‌ధ్య ఒప్పందం జ‌రిగిందని ఓ వైర‌ల్ అవుతుంది. భవిష్యత్‌లో ఒకవేళ విడిపోవాల్సి వస్తే.. నాగ చైతన్య నుంచి సమంత భరణం ఆశించనని చెప్పిందట. అలాగే, సామ్ నుంచి చైతూ ఆర్థికపరమైన సహకారాన్ని కూడా తీసుకోనని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విడాకులు తీసుకున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version