ఏపీ ప్రజలకు జగన్ బిగ్ షాక్..ఆస్తి పన్ను పెంచుతూ ఉత్తర్వులు !

-

ఏపీ ప్రజలపై మరో భారం వేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. ఏపీలోని అన్ని పుర, నగర పాలక సంస్థల్లో.. నగర పంచాయతీల్లో పన్నును పెంచింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది జగన్‌ సర్కార్‌. విజయవాడ కరెన్సీ నగర్‌ కు చెందిన ఒకరు తన ఫ్లాట్‌ కు 2020-21 వరకు ఏడాదికి 6 వేల 400 ఆస్తి పన్ను చెల్లించేవారు. ఆస్తి మూల ధన విలు ఆధారం పన్ను విధానం అమలులోకి వచ్చాక 2021-22 లో పన్ను 15 శాతం పెరిగింది.

దీని వల్ల 7 వేల 360 కట్టాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి 15 శాతం పెరగడంతో పన్ను 8 వేల 464 కు చేరింది. అంటే రెండు సంవత్సరాల వ్యవధిలో పన్ను 2 వేల 64 రూపాయలు అంటే 32.25 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఏప్రిల్‌ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని పురపాలక శాఖ ప్రకటన చేసింది. కాగా.. గత ఆర్థిక సంవత్సరంలో.. కూడా 15 శాతం పన్నును పెంచింది సర్కార్‌. ఆ షాక్‌ నుంచి తెరుకునేలోగా.. మళ్లీ పెంచడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version