విశాఖలో పుర్రె కలకలం.. తలను కాల్చుకొని తింటున్న సైకో..!

-

ఓ పాడుబడిన ఇంట్లో మనిషి తలను కాల్చుకుని తింటున్న సైకో ని చూసి ప్రజలు హడాలిపోయారు. ఈ ఘటన విశాఖపట్నం రెల్లివీధిలో చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసై సైకోగా మారిన రాజు అనే యువకుడు మనిషి తలను కాల్చుకొని తింటుండగా స్థానికులు గమనించి అక్కడ గుమిగూడారు. దాంతో ఆ పుర్రెను అక్కడే వదిలేసి సైకో పరారయ్యాడు. అలాగే స్థానికుల కేకలు విని పాడుబడిన ఇంట్లో నుంచి యువతి బయటకు వచ్చింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ తల ఎవరిది..? ఎవరినైనా హత్య చేసి దాన్ని తీసుకొచ్చాడా..? లేదంటే స్మశానంలో శవం తలను తీసుకొచ్చాడా..? లేక క్షుద్రపూజల ఏమైనా చేస్తున్నారా..? అన్న కోణంలో వారు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version