పబ్ జీ గేమ్ పిచ్చి ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ రైలు పట్టాలపై కూర్చుని పబ్ జీ గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా రైలు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది.
ముఫాసిల్ పీఎస్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్‌పూర్ మార్గంలో రైలు పట్టాలపై కూర్చున్న ముగ్గురు పబ్ జీ గేమ్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోయారు. చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటం వలన రైలు వస్తున్న విషయాన్ని మర్చిపోయారు.తీరా రైలు వచ్చి వారిని ఢీకొట్టింది. మృతులను పుర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టాలపై కూర్చుని గేమ్ ఆడటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు.