ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కచ్చితమైన తీర్పును ఇచ్చారు : గంటా శ్రీనివాసరావు

-

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో గంటా కలిశారు. అనంతరం మీడియాతో గంటా మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని చెప్పిన వైసీపీ నేతలు ఎక్కడికెళ్లారని హేళన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ రాజధానికి రెఫరెండం అని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించకుండా వెళ్లారని వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడినా వైసీపీ ఓటమిపాలు అయిందని తెలిపారు. వైసీపీ నేతలు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ లొంగకుండా ప్రజలు కచ్చితమైన తీర్పును ఇచ్చారని తన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ నేత` ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాలుగొనడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని… పొత్తులకు తొందర లేదని గంటా వెల్లడించారు. ఎన్నికల ముందే పొత్తులు, సీట్ల పంపకాలపై నిర్ణయాలు ఉంటాయని మండిపడ్డారు ఆయన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వ్యక్తపరిచారు. కన్నా లక్ష్మీణారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని మండిపడ్డారు గంటా.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version