పూణేలో విషాదం నెలకొంది. అదుపుతప్పి లోయలో వ్యాన్ పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. దాదాపు 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రావణ మాసం పవిత్ర సోమవారం సందర్భంగా ఖేడ్ తహసీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుందేశ్వర్ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ పూణే ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం ప్రకటించిన మోదీ… మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటన చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు.