నిరసన కోసం వచ్చిన రైతు ట్రక్ ని ఇంటిగా మార్చేశాడు !

-

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సింగు సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పంజాబ్ జలంధర్ కు చెందిన ఒక రైతు కంటైనర్ ట్రక్కును పూర్తిగా ఒక టెంపరరీ హౌస్ గా మార్చేశాడు. హర్‌ప్రీత్ సింగ్ మట్టు అనే ఆ రైతు యొక్క తాత్కాలిక వసతి గృహంలో సోఫా, బెడ్, టివి మరియు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు ఫంక్షనల్ టాయిలెట్ వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి.

ఇక ఆ రైతును పలకరించే ప్రయత్నం చేయగా “నేను యుఎస్ లో ఉన్న నా అన్నయ్య ఆదేశానుసారం డిసెంబర్ 2 న ఇక్కడకు వచ్చాను. రైతులకు సేవ చేయమని ఆయన నన్ను కోరారు. నేను నా పనులన్నీ వదిలి సింగు సరిహద్దులో ఏడు రోజులు పని చేశాను. అంతకుముందు నా ఐదు ట్రక్కులు కూడా ఇక్కడకు వచ్చాయి, నేను ఆ సమయంలో బస చేసిన నా హోటల్‌కు తిరిగి వచ్చినప్పుడు, నేను హోం శిక్ ఫీలయ్యాను, అందుకే ట్రక్కును ఒక టెంపరరీ ఇంటిగా ఎందుకు మార్చకూడదని నేను అనుకున్నాను “అని ఆయన చెప్పుకొచ్చాడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version