కరోనా పాజిటివ్ వస్తే జేబు ఖాళీ?

-

ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు భారత్ ను అల్లడిస్తున్న కరోనా వైరస పుణ్యమాని… ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో భారత్ లోని రాష్ట్రాలు… ఎవరి కష్టాలు వారు చెప్పుకుంటూ సహాయం కోసం కేంద్రంవైపు చూస్తున్న పరిస్థితి! ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే… లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అన్న ఆలోచనలు రాష్ట్రాల మదిలో అప్పుడే మొదలైపోయాయి! ఈ క్రమంలో ఆలోచించారో లేక జనాలకు ఇలాగైనా కాస్త భయం వచ్చి బయట తిరగడం మానేస్తారని భావించారో కానీ… కరోనా పాజిటివ్ వచ్చిన వారిపై మరో బాంబు పేల్చింది పంజాబ్ ప్రభుత్వం!

ఈ మహమ్మారి కరోనా భారిన పడిన ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రాణాంతక కరోనా వైరస్ బాధితులకు పంజాబ్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారి ఖర్చును ప్రభుత్వం భరించదు అని స్పష్టం చేసింది! ఈ మేరకు అమరీందర్ సింగ్ సర్కారు ఎవరి ఖర్చులు వారే భరించుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 260కిపైగా కేసులతో ఉన్న పంజాబ్… తమవద్ద తీవ్రత ఆస్థాయిలో లేదు అనుకుందో ఏమో కానీ… దశలవారీగా మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాని కోరుతున్నారు. అప్పుడైనా ఇప్పటివరకూ ఖజానా నుంచి మొత్తం అవుట్ గోయింగ్ గా ఉన్న ఆర్థిక వ్యవహారం కాస్త ఇన్ కమింగ్ తోడవుతుందని భావిస్తున్నారట. ఇదే సమయంలో రాష్ట్రానికి 3 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన ఆయన.. మధ్యంతర పరిహారంతో పాటు బకాయి పడిన జీఎస్టీ రూ. 4400 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు!

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ… కరోనా బాదితులు వారి వారి వైద్య ఖర్చులు వారే భరించాలని షాకింగ్ న్యూస్ చెప్పడంపై సర్వత్రా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version