దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2020 18వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 178 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 63 పరుగులు చేశాడు. అలాగే పూరన్ 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు 2 వికెట్లు దక్కగా, జడేజా, పీయూష్ చావ్లాలు చెరొక వికెట్ తీశారు.
కాగా మ్యాచ్ ఆరంభం నుంచి పంజాబ్ బ్యాట్స్‌మెన్ దూకుడును ప్రదర్శించారు. కేఎల్ రాహుల్ ఇతర ప్లేయర్లతో కలిసి చాలా సేపు క్రీజులో ఉన్నాడు. మిడిలార్డర్ వరకు పలువురు ప్లేయర్లతో రాహుల్ చక్కని భాగస్వామ్యాలను నెలకొల్పాడు. దీంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది.