ఆది పురుష్ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ వారసుడు ..!!

-

తాజాగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరీ నటిస్తున్న చిత్రం చోర్ బజార్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఆకాష్ పూరీ పాల్గొని ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. చోర్ బజార్ సినిమా జూన్ 24వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ఆకాష్ పూరీ.. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించారు..

ఇక పూరీ జగన్నాథ్ కి , ప్రభాస్ ఫ్యామిలీ కి మధ్య మంచి బాండిగ్ ఉన్న విషయం తెలిసిందే. ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాల నుండి వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ కొనసాగుతూ వస్తోంది. ఇక ఆ బాండింగ్ ఎంతలా ఉంది అంటే పూరీ జగన్నాథ్ వారసుడు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ప్రభాస్ ఏ స్థాయిలో ప్రమోట్ చేశాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు ఏకంగా రొమాంటిక్ సినిమా టీంతో ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇక ఈ క్రమంలోనే ఆకాష్, ప్రభాస్ తో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ.. రొమాంటిక్ సినిమా ప్రమోషన్ టైమ్లో ప్రభాస్ గారు మాతో రోజంతా సమయాన్ని స్పెండ్ చేశారు.ఆ సమయంలో మాకు ఆది పురుష్ సినిమా విజువల్స్ కొన్ని చూపించారు. ఆ విజువల్స్ లో ప్రభాస్ మామూలుగా లేడు ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటుందో అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్. ప్రస్తుతం ఆది పురుష్ గురించి ఆకాష్ మాట్లాడిన మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆకాష్ ఇచ్చిన ఆది పురుష్ మూవీ అప్డేట్ తో ప్రభాస్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version