మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి ఎందరో అగ్ర దర్శకులు వెయిట్ చేస్తున్నారు. త్రివిక్రమ్, రాజమౌళి, బోయపాటి, పూరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ చిరు లిమిటెడ్ గానే కమిట్ మెంట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి లో చేస్తున్నారు. ఇటీవలే ఆసినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్ర్రొడక్షన్ పనుల్లోఉంది. అక్టోబర్లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం చిరు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ప్రస్తుతానికి చిరు కమిట్ అయింది అతనొక్కడితోనే. ఆ సినిమా అన్ని పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ కానుంది.
దీంతో చిరు కోసం కర్చీప్ లు వేయడానికి పలువురు దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లో భాగంగా మళ్లీ పాత దర్శకుల పేర్లే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన సన్నిహితులు ఒకరు చిరుతో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని ఓ పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ రెడీ అంటే ఐదు రోజుల్లోనే కథ సిద్దం చేసి వినిపించడానికి రెడీ గా ఉన్నాడని వెల్లడించారు. దీంతో మరోసారి పూరి పేరు వాడి వేడిగా నలుగుతోంది. పూరి కథ సిద్దం చేయాలంటే నెలలు సమయం అవసరం లేదు. ఆన్ ది స్టాప్ టలో కథలు రాయగల ఏకైక టాలీవుడ్ డైరెక్టర్. నెల రోజుల వ్యవధిలోనే బౌండెడ్ స్ర్కిప్ట్ రెడీ చేయగల దిట్ట.
ఆ విషయంలో పూరి ఎందరికో స్ఫూర్తి. రాజమౌళి లాంటాడే పూరి దగ్గర అసిస్టెంట్ గా చేయాలని ఉందని బాహటంగా వెల్లడించాడంటే పూరి ప్రతిభ గురిచి చెప్పేదేముంది. వాస్తవానికి అన్నీ అనుకున్నట్లు గనుక జరిగుంటే మెగాస్టార్ 150వ సినిమాకి పూరి దర్శకత్వం వహించాల్సిన విషయం తెలిసిందే. చిరు కోసం ఆటోజానీ కథ సిద్దం చేసాడు. ప్రథమార్థం మెచ్చిన చిరు ద్వితియార్థంలో మార్పులు కోరారు. కానీ పూరి బిజీ షెడ్యూల్ ..ఇతర కారణాల వల్ల కుదరలేదు. నాటి నుంచి మెగాస్టార్ తో 150 కాకపోతే 151, అదీ కుదరకపోతే 152 చేస్తాను తప్ప మెగాస్టార్ ని మాత్రం వదలని తెలిపాడు. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్ పై ఆసక్తి సంతరించుకుంది.