సినిమా థియేటర్ మన అమ్మ.. పూరి జగన్నాథ్ ఎమోషనల్.

-

కరోనా కారణంగా మూతబడిపోయిన థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. 50శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ, దానివల్ల థియేటర్లకి నష్టం ఇంకా పెరుగుతుందని, ఇంకా మూసే ఉంచారు. థియేటర్లో బొమ్మ పడి ఎనిమిది నెలలు దాటిపోయింది. ఈ కారణంగా సినిమా అభిమానులు, డైరెక్టర్లు, హీరోలు, రోజు వారి కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ మేరకు పూరి జగన్నాథ్ ఒక ఆసక్తికరమైన వీడియో షేర్ చేసాడు. కన్నడ చిత్ర సీమ రిలీజ్ చేసిన ఈ వీడియోలో ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ కి రావాలని, థియేటర్లో చేసే సందడి చూడాలని, ప్రేక్షకులతో థియేటర్ అంతా కళకళలాడుతుంటే కళాకారుడికి ఆనందంతో కడుపు నిండుతుందని, ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మలాంటిది థియేటర్ అనీ, అందుకే మళ్ళీ థియేటర్ కి రండి అంటూ ఒక ఎమోషనల్ వీడియో పెట్టారు. ఆ వీడియోని షేర్ చేసిన పూరీగారు, మళ్లీ ఆ రోజులు రావాలి, విజిల్స్ వెయ్యాలి, పేపర్స్ ఎగరాలి, చొక్కాలు చిరగాలి.. సినిమా థియేటర్ మన అమ్మ అంటూ మెసేజ్ పెట్టాడు.

సినిమా అంటే పూరీగారికి ఎంత పిచ్చో నేనింతే సినిమా ద్వారా చూపించారు. మరి అమ్మలాంటి థియేటర్ ఎప్పుడు తెరుచుకుంటుందో? ప్రేక్షకులంతా తమ అభిమాన హీరో సినిమాని ఎప్పుడు చూస్తారో?

Read more RELATED
Recommended to you

Exit mobile version