నిర్మాత అనేవాడు రోజు నిద్రమాత్రలు వేసుకోవాల్సిందే …పూరి జగన్నాధ్

-

టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నాలుగు సినిమాలు ఫ్లాపయినా మళ్ళీ సినిమా చేయడానికి టీం మొత్తం రెడీగా ఉంటుంది. అలాగే హీరో రెడీ. అంతేకాదు బిజినెస్ కూడా అలానే అవుతుంది. పూరి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ..పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవు అన్న గట్టి నమ్మకం. ఇక హీరోలైతే సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఒక్కసారైనా ఆయన దర్శకత్వం లో నటించాలని తెగ ఆరాటపడతారు. పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఈ ఒక్క సినిమా పూరి జీవితాన్ని నిర్ధేశించింది ..నిర్ణయించింది.

 

పూరి సినిమాలలో మంచి కథ ఉంటుంది. హీరో రఫ్ అండ్ ఠఫ్ గా యారగెంట్ గా ఉంటాడు. దేన్ని లెక్కచేయడు. ఇదీ పూరి హీరోయిజం. నిజ జీవితంలోను ఇలాగే ఉంటారు పూరి జగన్నాధ్. అలానే ఉండాలని చెబుతారు. ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా స్టార్ రైటర్ గా స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన పూరి నిర్మాతగా మారాకే ఎక్కువ కష్టాలను అనుభవించారు. ఆకాలం నుంచి చూసుకుంటే ఒక దర్శకుడిగా 100 కోట్లు సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. తన పాటికి తను వరసగా సినిమాలు చేస్తూ వెళ్ళారు. సినిమా సినిమా కి రెమ్యూనరేషన్ పెరిగింది. సొంతగా నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు నిర్మించారు. సక్సస్ అయ్యారు. కాని ఆయన నమ్మకమే ఆయన్ని రోడ్డున పడేసింది. కష్టపడి సంపాదించుకున్న 100 కోట్లు నమ్మిన స్నేహితుడే కాజేసి పూరిని రోడ్డున పడేశాడు.

 

అయినా మళ్ళీ మొండిగా జీవితంతో పోరాడారు. సినిమాలు తీశారు. సక్సస్ లు అందుకున్నారు. పోగొట్టుకున్నదానికంటే ఎక్కువే సంపాదించుకున్నారు. అయితే నిర్మాతగా ఆయన చెప్పే మాట ఒక్కటే. ఇండస్ట్రీలో అన్నికంటే కష్టమైనది నిర్మాతగా సినిమాలు తీయడం. కాస్త బడ్జెట్ ఎక్కువవుతుందంటే ఏ నిర్మాతైనా నిద్రమాత్రలు వేసుకోవాల్సిందే. అని పూరి చెప్పడం వెనక ఆయన సొంత అనుభవమే ఉందని ఖచ్చితంగా అంటారు. పడిలేచిన కెరటం అంటే ప్రస్తుతం ఉదాహరణగా పూరి నే చూపించాలి. ఎడమచేతికి తెలియకుండా కుడిచేయితో సహాయం చేసేవాళ్ళేవరంటే కూడా పూరి జగన్నాధ్ నే చూపించాలి. అందుకు ఉదాహరణగా ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ. ఆవిడకి ప్రతీ నెల 25000 రూపాయలు పంపడం గొప్ప విషయం.

 

ఇక పూరి ఒక మనిషిని నమ్మడానికి స్నేహం చేయడానికి తారతమ్యం చూపించరు. స్నేహితులు అంటే ఇద్దరు వ్యక్తులు అంటారు తప్ప ఇద్దరు మగాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు అని చెప్పరు పూరి. అందుకు కూడా గొప్ప ఉదాహరణ పూరి జగన్నాధ్ ఛార్మి అని చెప్పాలి. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటుంటారు. ప్రస్తుతం పూరి కనెక్ట్స్, పూరి టూరింగ్ టాకీస్ అన్న బ్యానర్స్ మీద ఇద్దరు కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్స్ మీదే ప్రస్తుతం పూరి-ఛార్మి విజయ్ దేవరకొండ అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తూ, అలాగే కొడుకు ఆకాష్ పూరి తోను రొమాంటిక్ అనే సినిమాను నిర్మిస్తూ తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version