ట్రంప్ ప్రకటన లో నిజం ఎంత ? ఎకానమీ కోసం కొత్త కబుర్లు ?

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం కరోనా వైరస్ ని జయించినట్లుగా ఇటీవల ప్రకటించుకున్నారు. తాము తీసుకున్న గట్టి చర్యల ఫలితంగానే వైరస్ వ్యాప్తి చెందటం తగ్గుముఖం పట్టిందని అన్నారు. దీంతో అంతర్జాతీయ మీడియా ఒక్క సారిగా షాక్ తింది. కరోనా వైరస్ మూడవ దశ ఆల్రెడీ దాటేసింది అని…ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది అంటూ డోనాల్డ్ ట్రంప్ అంటున్నారు. కానీ దేశంలో లెక్కల ప్రకారం చూసుకుంటే అమెరికాలో మరణాలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. అయితే ట్రంపు చేసిన ప్రకటనలో వాస్తవం లేదని ప్రతి పక్షాలు అంటున్నాయి. కేవలం ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో …ఇప్పటి నుండే ఆ హడావిడి మొదలవడంతో కరోనా వైరస్ సమస్యను పక్కదోవ పట్టించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆర్థిక మాంద్యం అమెరికాలో దెబ్బతినటంతో… అమెరికా ఎకానమీ ని మళ్లీ రైజ్ చేయడానికి సరికొత్త కాకమ్మ కబుర్లు ట్రంప్ చెబుతున్నారని అంటున్నారు.

 

ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉందని… వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఈ సమయం లో ఉన్న పెట్టుబడులు మొత్తం పోతే  ఇప్పటికే మైనస్ జి.డి.పి లో ఉన్న అమెరికా ఎకానమీ అధ్యక్ష ఎన్నికలు వచ్చే టయానికి పూర్తిగా మట్టానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోవడం గ్యారెంటీ అని అంటున్నారు. అందుకే పెట్టుబడిదారుల దృష్టి మరల్చడానికి ట్రంప్ సరికొత్త నాటకం ఆడుతున్నారని ట్రంపు చేసిన ప్రకటనలో వాస్తవం లేదని తేల్చిపారేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version