Pushpa 2 : అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ మధ్య విభేదాలు..?

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బన్నీ పుష్ప టీమ్ను మూడు భాగాలుగా వేరు చేసి షూట్ చేయాలని సూచిస్తే.. సుక్కు అవన్నీ వద్దని అన్నాడట. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బన్నీ గడ్డం కూడా ట్రిమ్ చేయడంతో ఇప్పుడు ఎలా షూట్ చేయాలని సుకుమార్ అలిగి అమెరికా వెళ్లిపోయాడని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.కాగా, ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version