నేను ఆరోగ్యంగానే ఉన్న..ఆందోళన చెందొద్దు:ఆర్. నారాయణమూర్తి

-

తన ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. ఆయన అస్వస్థతకు గురయ్యారనే వార్తలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ నారాయణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయతో కోలుకుంటున్నట్లు పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

కాగా, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తికు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో నటుడు నారాయణమూర్తిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతుండంతో.. పీపుల్ స్టార్ ఫాన్స్‌ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version