అల్లు అర్జున్ అభిమానులకు పుష్ప టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను డిసెంబర్ 17 న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ మరియు పాటలు విడుదల చేయగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా సినిమాలో అల్లు అర్జున్ లుక్ వైల్డ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన ఫోటోలు విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా డిఎస్పి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య- 2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను పుష్పరాజ్ రీచ్ అవుతాడో లేదో చూడాలి.
https://twitter.com/PushpaMovie/status/1444142405070962692?s=19