ఏ రిలేషన్ షిప్ అయినా బాగుండాలంటే పట్టూ విడుపూ ఉండాల్సిందే. ఐతే ఎప్పుడు పట్టుబట్టాలి. ఎప్పుడు విడవాలి అనే విషయాలు ఖచ్చితంగా తెలియాలి. లేదంటే బంధానికి బీటలు వారి మెల్లమెల్లగా అందులోకి నీళ్ళు చేరి కోటగోడలు కూలిపోతాయి. బంధానికి బీటలు వారడానికి ముఖ్య కారణాలు వాదన. అవును, వాదనలు తెగకపోతే అవి రిలేషన్ షిప్ బ్రేకప్ కి దారి తీస్తాయి. భార్యా భర్తల విషయంలో ఇలాంటి వాదనలు రాకూడదు. ఎలాంటి వాదనలు రిలేషన్ షిప్ కి ఇబ్బంది పెడతాయో చూద్దాం.
భాగస్వామికి గౌరవం ఇవ్వనపుడు
మీ భాగస్వామికి గౌరవం ఇవ్వకుండా ఉంటే వాదన మొదలవుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆఫీసు పని మీద బయటకి వెళ్లే మీరు, ఇంట్లో మీ కోసం ఎదురుచూస్తున్న భాగస్వామికి గౌరవం ఇవ్వకపోతే, అసహనం అవతలి వాళ్ళలో పెరిగి, పెరిగి వాదనలు మొదలవుతాయి.
మీదే కరెక్ట్ అని భావించినపుడు
ఒక విషయంలో గొడవ జరిగింది. మీరు చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. అవతలి వారు చెప్పేది మీరు అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా మీలాగే ఉన్నారు. ఎవరో ఒకరు తగ్గకపోతే వాదన తెగదు. వాదన తెగకపోతే ఆ గొడవ పెరుగుతూ వెళ్తుంది.
పిల్లల విషయంలో
పిల్లలు కావాలా వద్దా అనే దగ్గర నుండి పిల్లలు పుడితే వచ్చే బాధ్యతల విషయంలో గొడవల గురించి వాదనలు ఒక పట్టాన తగ్గవు. పిల్లల బాధ్యత తల్లిదే అనుకుంటాడు భర్త. ఇంటి బాధ్యత అయినా భర్త చూసుకోవాలనుకుంటి భార్య. ఎవరి వైపు నుండి చూసినా ఎటూ తేలని విషయం.
ఒకే వాదనని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు
ఒక గొడవ అయ్యిందంటే మళ్ళీ దాన్ని లేవనెత్తకపోవడమే కరెక్ట్. ప్రతీ సారి అదే విషయాన్ని తీసుకువచ్చి, మళ్ళీ మళ్ళీ గుర్తుకు తీసుకురావడం, పొడుస్తూ మాట్లాడడం అవతలి వారిని మానసికంగా హింసకు గురి చేస్తుంది. వీటివల్ల బంధంలో చాలా మార్పులు సంభవిస్తాయి.