కరోనా కారణంగా ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని నియమం వచ్చింది. ఈ మేరకు అన్ని రంగాలు నిబంధనలు అమలు చేస్తూనే వ్యాపార వ్యవహారాలను నిర్వర్తిస్తున్నాయి. బ్యాంకులు కూడా పలు స్కీంలను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాయి. వినియోగదారుడు బ్యాంకుకు రాకుండానే ట్రాన్సక్షన్ నిర్వహించుకునేలా సదుపాయాలను కల్పించాయి. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించే విధంగా ఆర్‌బీఐ కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాంటాక్ట్‌లెస్ కార్డుతో ట్రాన్సక్షన్ నిర్వహించుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ ప్రయోగం సక్సెస్ కూడా అయింది.
అయితే ఇటీవల కాంటాక్ట్‌లెస్ లావాదేవీల ద్వారా రూ.5 వేల వరకు చెల్లింపులు జరపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆర్‌బీఐ కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రాన్సక్షన్ లిమిట్‌ను రూ.5 వేలకు పెంచింది. అయితే కాంటాక్ట్‌లెస్ లిమిట్ పెంచినా.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు వినియోగదారులు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. డబ్బులు చెల్లింపు విషయంలో తలెత్తే ఇబ్బందులకు గల కారణాలు ఈ విధంగా ఉన్నాయి.
పీఓఎస్ అప్‌డేట్ చేయకపోవడం..
కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహించడానికి.. అమ్మకందారులకు బ్యాంకు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాన్ని అందించింది. ఈ యంత్రంపై కాంటాక్ట్‌లెస్ కార్డు పెట్టినట్లయితే ఆటోమెటిగ్‌గా మనం చెల్లించాల్సిన డబ్బులు డిడక్ట్ అవుతాయి. అయితే ఆర్‌బీఐ కాంటాక్ట్‌లెస్ లిమిట్ పెంచినప్పుడు కొందరు విక్రేతదారులు తమ పీఓఎస్ యంత్రాన్ని ఆప్‌డేట్ చేసుకోలేదు. దీని వల్ల డబ్బుల చెల్లింపుల విషయంలో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
వినియోగదారులకు కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ తన పరిమితిని 2.5 రెట్లు పెంచి రూ.5 వేలకు కుదించింది. మొదట్లో కాంటాక్ట్‌లెస్ ట్రాన్సక్షన్ లిమిట్ రూ.2 వేలు ఉండగా.. ప్రస్తుతం ఆ లిమిట్‌ను పెంచింది. వినియోగదారులు, విక్రేతదారులు, బ్యాంకు కస్టమర్లు కాంటాక్ట్‌లెస్ ట్రాన్సక్షన్ లిమిట్ పెంచమని ఫిర్యాదు చేయడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాన్సక్షన్ లిమిట్ పెరగడంతో మోసం జరిగే ఆస్కారం ఉందని, ఈ మేరకు బ్యాంకులు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
దరఖాస్తు చేసుకోండిలా..
అయితే కాంటాక్ట్‌లెస్ లిమిట్‌ను రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుకోవాలంటే కస్టమర్లు ఆయా బ్యాంకులకు సంప్రదించాలి. లేదా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. కాంటాక్ట్‌లెస్ కార్డుదారుడు కార్డు లిమిట్ పెంచుకోవాలని అనుకుంటే బ్యాంకును సంప్రదించి మార్చుకోవచ్చు. లేదా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు బ్యాంకు కొన్ని ప్రశ్నలను అడుగుతుంది. ఆ తర్వాత నిర్ధారణ కాల్, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ పంపుతారు. ప్రాసెస్ ముగిసిన తర్వాత మీ కార్డు లిమిట్‌ను పెంచుతారు.