టీడీపీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కన బెట్టా : కేశినేని నాని

-

టీడీపీ కోం నా సొంత వ్యాపారాలను పక్కన బెట్టానని కేశినేని నాని పేర్కొన్నారు. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాదయాత్ర, స్థానిక ఎన్నికలను నా భుజాన మోసా.. టీడీపీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డాను. చాలా మంది చెప్పినప్పటికీ నేను టీడీపీలోనే కొనసాగానని తెలిపారు.

నన్ను గొట్టంగాడు అన్న భరించాను. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే నిర్ణయించారు. నన్ను చెప్పుతీసుకొని కొడతాను అని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి అన్నా కానీ పార్టీ స్పందించలేదు. నన్ను ఎవ్వరూ ఎన్ని మాటలు అన్నా నేను అవేమి పట్టించుకోలేదు. నా సొంత వ్యాపారాల కంటే పార్టీనే ముఖ్యం అనుకున్నాను. తొమ్మిదేళ్లలో నేను చేసిన ఒక తప్పునైనా చూపించండి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని కేశినేని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version