డివిజన్ లో ప్రజా సమస్యలు డైరీ లో రాయాలి, బయటకు వెళ్ళేప్పుడు డైరీ తీసుకుని వెళ్లి రాసుకోండి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం రెచ్చిపోయారు. మనల్ని మన పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేశారు. పగడాల నాగరాజు, దేవాభక్తుని కిషోర్ వంటి వారిని జైల్లో పెట్టారు. కర్నాటి కృష్ణ మీద అక్రమ కేసు పెడితే, డివిజన్ ప్రజలు రెండు వందల మంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్తే కేసు వాపసు తీసుకున్నారు. మిత్తి పద్దు కాకుండా ప్రజల సమస్యల పద్దు రాయాలి, మన ప్రభుత్వం వచ్చాక అంతకంతకూ తిరిగి చెల్లిద్ధాం. మీ అందరి నుండి డైరీ లను తీసుకుని మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారికి మిత్తికి వడ్డీతో సహా చెల్లిస్తాం.
ఫిబ్రవరి 17 వ తేదీన కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలి, మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలి. కేసీఆర్ దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అన్నందుకు రేవంత్ రెడ్డి ముందు లేచి నిలబడమని అంటున్నాడు ఆ వయసులో అలా మాట్లాడటం గొప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న ఒక్క హామీ నెరవేర్చలేదు, ఇచ్చిన హామీల మీద మనం నిలదీయాల్సిన అవసరం ఉంది . కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించారు. ట్విట్టర్ అకౌంట్ లో పాలన బాగుందా అంటే ఫాం హౌస్ పాలన బాగుందా, ప్రజా పాలన బాగుందా అంటే 70 శాతం ప్రజలు ఫాం హౌస్ పాలన బాగుంది అని తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ లలో అదే పురుగుల అన్నం పెడుతున్నారు. ఒక సంవత్సర పాలన చూస్తుంటే రారా అని వచ్చి ప్రశ్నిస్తే తిరిగి ఆయన వయసు పై అసభ్యమైన పదజాలంతో మాట్లాడాడు సీఎం. కిందపడి కాలు విరగకొట్టుకున్న ఆయన లేచి నిలబడ్డాడు, ఆయన కనీసం కర్ర కూడ పట్టుకుని నిలబడలేదు. ఆయన లేకుంటే టీపీసీసీ లేదు, నీకు సీఎం పదవి లేదు. అభివృద్ధి, సంక్షేమం లో కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసిండూ . ఒకసారి అధికారాన్ని ప్రజలు మీకు ఇచ్చి ఉండొచ్చు కానీ మళ్ళీ ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను. ప్రజలు 10 ఏళ్లలో కేసీఆర్ ను అసభ్య పదజాలంతో దూషించలేదు, కానీ నేడు మహిళలు సైతం నిన్ను దూషిస్తున్నారు అని పువ్వాడ అజయ్ అన్నారు.