రైతులు పంట మార్కెట్ కు తీసుకుని వస్తె మార్కెట్ లో జెండా పాట 14 వేలు ఉంది.. మనప్పుడు 18 వేలు ఉండేది. పత్తికి నేడు మార్కెట్ లో 6 వేలు మద్దతు ధర వస్తె గొప్ప అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయ్యింది. అంటే పంట కాలాలు మూడు అయిపోయాయి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఆనాడు రైతు బంధు 10 వేలు ఇస్తుంటే బిచ్చమని, మేము 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించాడు. ఆ రోజు 12 వేలు మాత్రమే ఇస్తా అని ఎందుకు చెప్పలేదు, రుణమాఫీ అందరికీ ఇస్తా అని ఇప్పుడు కొందరికే ఎందుకు ఇస్తున్నారు. రెండు లక్షలు పైన ఉన్నవాళ్ళకు ఎందుకు ఇవ్వను అంటున్నారు. ఇచ్చిన హామీల మీద పోరాటం చేయాలని కేసీఆర్ అంటే ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా తూలుతున్నవ అనడం సరికాదు.
గతంలో కేసీఆర్ ను తిడితే ప్రజలు ఊరుకునే వారు కానీ ఇప్పుద్ మాత్రం అస్సలు సహించడం లేదు. ఇంకా రెండు డైరీ లు మాత్రం కరెక్ట్ గా కాపాడుకోండి తర్వాత మనం ఏం చేయాలో అది చేద్దాం. మన యువ నాయకుడు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఉర్రుతలు ఊగుతుంది. మా సభల బయట మీరు పల్లీలు అమ్ముకునే రోజులు వస్తున్నాయి, విర్రవీగకండి. ఒక్క సంవత్సరంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబ్దాం. మొదటి సంవత్సరం మా కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు, మేము ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాం. కేసీఆర్ ఒకానొక రోజు రేవంత్ రెడ్డికి ఓ మహానుభావుడి లా కనిపిస్తాడు అని పువ్వాడ అజయ్ తెలిపాడు.