రాష్ట్రంలోని ఓ పోలీస్‌స్టేషన్ ఆవరణలో కొండచిలువ హల్‌చల్ చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పీఎస్ ఆవరణలో వెలుగుచూసింది. సుమారు 8 అడుగుల భారీ కొండచిలువ సంచారం పోలీసులతో పాటు స్థానికులను కూడా భయాందోళనకు గురిచేసింది. పోలీస్‌స్టేషన్ ఆవరణ నుంచి కాలువ నీటిలో కొండచిలువ సంచారాన్ని గుర్తించిన పోలీసులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ కాలువలో నుంచి వెళ్తున్న కొండ చిలువను పట్టుకున్నాడు. కొండ చిలువకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పట్టుకుని అటవీ శాఖకి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.కొండచిలువను బంధించి తరలించడంతో పోలీస్‌స్టేషన్ చుట్టుపక్కల ఉండే స్థానికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.