బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్యకు ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మేరకు ఆయన హోం మంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆగంతకుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, గెల్లు శ్రీనివాస్ కు మద్దతు ఇచ్చినప్పటి నుంచి ఫోన్ లో బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నెంబర్ ఫేస్బుక్ లో పెట్టి బెదిరిస్తున్నట్లు తెలిపాడు. రెండు రోజుల నుంచి బెదిరింపులు తీవ్రమైనట్లు తెలిపారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆర్. క్రిష్ణయ్యకు బెదిరింపు కాల్స్.. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినప్పటి నుంచే..
-