Radhika: రాధికకు ఆ దేశ పార్లమెంటు ప్రత్యేక పురస్కారం..గర్వంగా ఉందన్న నటి

-

సీనియర్ హీరోయిన్ రాధిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటించిన సినిమాలు టీవీల్లో వస్తున్నాయంటే చాలు..ప్రేక్షకులు తప్పకుండా చూస్తుంటారు. రాధిక ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటి రాధిక..టెలివిజన్ షోస్ లోనూ కనబడుతోంది. మరో వైపున డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసి ‘గాలివాన’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది.

మల్టీ టాలెంటెడ్ ఉమన్ అయిన రాధిక అలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. బుల్లితెర, వెండితెర, ఓటీటీ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నది. రాడాన్‌ మీడియా వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టరుగా ఉన్న రాధికకు తాజాగా యూకే పార్లమెంట్‌లో పురస్కారం లభించింది.

‘ఉమెన్స్‌ సెలెబ్రేషన్స్‌-2022’లో భాగంగా బ్రిటన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. యూకే పార్లమెంట్‌ సభ్యురాలు మారియా మిల్లర్‌ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను ఎంపిక చేసి అవార్డులతో సన్మానించారు. ఈ పురస్కారానికి సీనియర్ హీరోయిన్ రాధిక ఎంపికయ్యారు.

అవార్డు అందుకున్న అనంతరం రాధిక మాట్లాడుతూ యూకే పార్లమెంటులో ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా, గర్వంగాను ఉందని చెప్పింది. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన సెలెక్టర్లకు, కొన్ని దశాబ్దాలుగా తనకు మద్దతిస్తూ ఆదరిస్తున్న సినిమా, టీవీ పరిశ్రమలకు, ప్రేక్షకులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version