మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరారు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ( ఐటీఐఆర్) అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఐటిఐఆర్ పై బిఆర్ఎస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటిఐఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఐటీఐఆర్ కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులే కేంద్రం మంజూరు చేసిందని పేర్కొన్నారు.
డిపిఆర్ సమర్పించకుంటే కేంద్రం నిధులు ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై బీఆర్ఎస్ నాయకులు మాటల దాడి పెంచుతున్నారని విమర్శించారు. తెలంగాణలో హైవేలు, రైల్వేల అభివృద్ధికి కేంద్రం రెడీగా ఉందని చెప్పారు. హైదరాబాద్ కి రావాల్సిన ఐటిఐఆర్ ప్రాజెక్టు పై బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని అనవసరంగా దోషిని చేస్తోందని అన్నారు. ఐటిఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక్క పని కూడా చేయలేదని నిందించారు.