వైఎస్సార్సీపీ అధినేత కు… వైశ్రారైకా ఎంపీ నయా విన్నపం!!

-

తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో సంచలన వ్యాఖ్యలు చేసే క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు తనదైన శైలిలో ఒక విన్నపం చేసుకున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణం రాజు! ఆ విన్నపం సారాంశం కూడా తనకు తమరిని కలుసుకునే అవకాశం ఇవ్వగలరు.. అలా కానిపక్షంలో మీడియాకు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నట్లుగానే ఉంది అనే కామెంట్లు పడుతున్నాయి!

వివరాల్లోకి వెళ్తే… తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు, దానిపై ఆయన ఇచ్చిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలపై దూషణలు, ప్రతిగా పోలీస్ స్టేషన్ లో కేసులు… ఇలా సాగిపోతున్న ఈ సిరీస్ లో తాజాగా మరోసారి జగన్ కు ఒక అప్పీల్ చేసుకున్నారు రఘురామకృష్ణంరాజు!

“గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏమిటంటే… ప్రజలు మనమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ ఆశయాలకి వారి ఆశలకి ఫెర్ ఫెక్ట్ మ్యాచ్ ఉంది. కొంతమంది వల్ల మీ ఆశలకు – ఆశయాలకి ఎక్కడైనా ప్రజల్లో ఇబ్బంది వస్తే.. ఆ విషయంపై నేను మీకు డైరెక్టుగా తెలియజేసే అవకాశం ఇవ్వండి. అలాకాని యెడల.. నేను మీడియా ద్వారా తెలియజేస్తే.. మన్నించండి దండించకండి అని ముఖ్యమంత్రిగారికి విన్నవిస్తున్నాను” అని అన్నారు!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version