వైరల్: విమానంలో వాన… గొడుగులు పట్టుకున్న ప్రయాణికులు..!

-

రష్యాకు చెందిన రొస్సియా ఎయిర్ లైన్స్ విమానం ఖబరోవ్స్క్ నుంచి సోచీకి ప్రయాణమైంది. ప్రయాణికులు విమానంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కూర్చున్నారు. విమానం నల్ల సముద్రంపై నుంచి వెళ్తుండగా ఇంతలో విమానంలో వాన చినులుపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఏం జరుగుంతోంది. విమానంలో వర్షపు చినుకులు ఎలా పడుతున్నాయంటూ అందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎయిర్ హోస్టెస్లు వచ్చి ప్రయాణికులు సర్ది చెప్పి పైలెట్లకు సమాచారం అందించారు.

rain in flight

పైలెట్లు ప్రయాణికులతో విమానంలో ఎలాంటి లోపం లేదని, బయట అసలు వాన పడట్లేదన్నారు. అయితే విమానంలో వర్షపు చినుకులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చారు పైలెట్. గొడుగులైన అందించండని అడగడంతో ఎయిర్ హోస్టెస్లు ప్రయాణికులకు గొడుగులు అందించారు. ల్యాండ్ అయ్యే వరకు వాన చినుకులు పడుతూనే ఉంది. విమానం ల్యాండ్ అయ్యాక వేగంగా ప్రయాణికులను దింపేసి టెక్నికల్ టీమ్ సహాయంతో చెక్ చేయించారు. చెక్ చేసిన అనంతరం ప్రయాణికులపై పడింది వాన చినుకులు కాదని, విమానంలోని ఏసీ వ్యవస్థ పనిచేయకపోవడంతో దాని నుంచి వచ్చే నీరు వానలా కురిసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version