ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఇప్పటికైనా సీఎం జగన్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలన్నారు. కోర్టు తీర్పు మేరకు రమేష్ కుమార్‌ను నియమిస్తే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. న్యాయస్థానాలను గౌరవిద్దాం.. న్యాయవ్యవస్థ విలువను కాపాడదాం అని పేర్కొన్నారు.
అనవసరంగా న్యాయవ్యవస్థలతో పెట్టుకుని ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన)ని కొని తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఆర్టికల్ 356 ఎంతో దూరంలో లేదన్న సంగతి గుర్తించుకోవాలని ప్రభుత్వానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్నింగ్ ఇచ్చారు. న్యాయవ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.