ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలే రేపు 40 మంది కావచ్చునని, ఎవరా నలుగురు అన్నది సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాలని, పరిస్థితిని చక్క దిద్దుకోకపోతే యువరాజు చిత్రంలో ఏరా నలుగురు అనే పాటను ముఖ్యమంత్రి పాడుకుంటూ గడపాల్సి వస్తుందని, ఇంకా అవమానాలను భరించే, సహించే శక్తి ఒక్కరిద్దరు జాకోగాళ్ళకు మాత్రమే ఉంటుందని అన్నారు.
సిగ్గు ఉన్న ప్రతి ఒక్కరూ తిరగబడతారని, కొడితే కొడుతారు… తిడితే తిడతారని, గతంలో చాలా మంది ఎమ్మెల్యేలను కొట్టి ఉంటారని, మళ్లీ కొడుతామంటే వారు ఊరుకునే పరిస్థితి లేదని, మీరు మీ పరిమితుల్లో ఉండడం మంచిదని జగన్ మోహన్ రెడ్డి గారిని పరోక్షంగా రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు. రెడ్డి సామాజిక వర్గంలో ఎంతో మంది ఉద్దండులైన నాయకులు ఉన్నారని, గతంలో నీలం సంజీవ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు వంటి లబ్ద ప్రతిష్టులైన నాయకులు ఉండగా, ఇటీవల కొంత మందిని చూస్తే బాధ అనిపిస్తుందని, తానేమీ రెడ్డి వ్యతిరేకిని కానని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంతో మందితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కానీ తనని తిట్టిన దరిద్రులను మాత్రమే తాను తిట్టానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.