ఏకైక రాజధానిగా అమరావతే.. ఈ భేటీతో నమ్మకం పెరిగింది !

-

కేంద్ర హోం సెక్రెటరీ అజయ్ భల్లాని కలిసి రాజధాని అంశం మీద వివరించానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. పరిపాలనను ఎక్కడ నుంచి కొనసాగిస్తే దానినే రాజధాని అంటారని ఆయన అన్నారు. హైకోర్టు ఉంటే న్యాయ రాజధాని, శాసనసభ ఉంటే శాసన రాజధాని అని అనరు అని ఆయన పేర్కొన్నారు. రాజధానిని తరలించడమే లక్ష్యంగా “పాలనా వికేంద్రీకరణ”అనే పేరు తీసుకొచ్చారన్న ఆయన అమరావతి రైతుల ఆందోళన, వారికి ఇచ్చిన హామీలు, వారి త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలని కార్యదర్శిని కోరానని అన్నారు.

raghu

కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్లలో అవేవి పరిగణలోకి తీసుకోలేదని చెప్పానని పేర్కొన్నారు. అటార్నీ జనరల్ లేదా సోలిసిటరీ జనరల్ న్యాయ సలహాతో అఫిడవిట్లు వేయాలని చెప్పానని దానికి సానుకూలంగా స్పందించిన అజయ్ భల్లా అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. అమరావతి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, మనోవేదనకు గురికావొద్దని ఆయన పేర్కొన్నారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని నాకు పూర్తి నమ్మకం ఉందని, ఈ భేటీతో ఆ నమ్మకం మరింత పెరిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version