ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పార్టీ ఎంపీ అరెస్టుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇటు తెలంగాణ ప్రతిపక్షాలు కూడా వైసీపీపై విమర్శల దాడులు చేస్తున్నాయి. ఇక ఎట్టకేలకు వైసీపీ కూడా స్పందించింది. వైసీపీ తరఫున ఆ పార్టీ నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని, అందుకే ఇన్ని రోజులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారని మండి పడ్డారు. రఘురామ ప్రజల పక్షం అయితే టీడీపీని ఎందుకు తిట్టలేదంటే ప్రశ్నించారు.
రఘురామను కొట్టారనే మాటలు అవాస్తవం అని, ఆయనకు బెయిల్ రాకపోతే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల మధ్య గొడవలు రేపే విధంగా ఆయన ఇన్ని రోజులు రాజకీయాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మిథున్‌రెడ్డి వెనక జగన్ ఉన్నాడా లేక ఆయనే స్వయగా ఇలా స్పందిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారం రేపుతున్నాయి.