బంగ్లా VS ఆఫ్ఘన్: సెంచరీ తో చెలరేగిన రహ్మనుల్లా గుర్బాజ్

-

బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్యన జరుగుతున్న రెండవ వన్ డే లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన ఆఫ్గనిస్తాన్ భారీ స్కోర్ దిశగా దూసుకు వెళుతోంది. ఆఫ్గనిస్తాన్ కు ఓపెనర్లు గుర్బాజ్ మరియు ఇబ్రహీం జాడ్రన్ లు మొదటి వికెట్ కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మొదటి నుండి దూకుడుగా ఆడిన గుర్బాజ్ వన్ డే కెరీర్ లో నాలుగవ సెంచరీని అందుకున్నాడు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 125 బంతుల్లో 13 ఫోర్లు మరియు 8 సిక్సులతో 145 పరుగులు చేశాడు. అనంతరం షకిబుల్ హాసన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యు గా వేనుతిరిగాడు. ఇతని ఇంకా కొన్ని ఓవర్ లపాటు ఆడి ఉంటే డబుల్ సెంచరీ సాధించేవాడు. జట్టు స్కోర్ ప్రస్తుతం 300 కు చేరువలో ఉంది. ఆఖరి ఓవర్ లు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లా ముందు భారీ టార్గెట్ ను ఇవ్వడానికి గట్టిగానే ఆడుతున్నారు.

ఇక మొదటి మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ గెలవగా ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ ఆఫ్ఘన్ వశం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version