రాహుల్ తగ్గేదెలే..జైలుకు రెడీ..బీజేపీ డ్రామా..కాంగ్రెస్ ఎంపీల రాజీనామా!

-

ప్రధాని మోదీ టార్గెట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. తనపై అనర్హత వేటు వేసిన మొదట సారి రాహుల్ మీడియా ముందుకొచ్చి అదానీ..మోదీ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. 2019 సమయంలో దొంగల ఇంటి పేరు మోదీ అని ఉంటుందని కామెంట్ చేస్తే..దానిపై గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై తాజాగా సూరజ్ కోర్టు..రాహుల్ రెండేళ్ల జైలు శిక్ష విధించింది..అలాగే బెయిల్ ఇచ్చి..నెల రోజుల లోపు పై కోర్టులో అప్పీల్ చేసుకోవాలని సూచించింది.

కానీ పైకోర్టుకు వెళ్లకముందే రాహుల్ పై లోక్ సభ సెక్రటరీ అనర్హత వేస్తూ వేశారు. రెండేళ్ళు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధుల పదవిపై వేటు వేయాలనే చట్టం నేపథ్యంలో..వెంటనే రాహుల్ ఎంపీ పదవిపై వేటు వేశారు. అసలు పై కోర్టుకు వెళ్లకముందే ఇదంతా మోదీ సర్కార్ చేసిందని చెప్పి కాంగ్రెస్ తో సహ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ స్పందిస్తూ..  అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు ఎవరు పెట్టారు? అని ప్రశ్నించిన ఆయన..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు.

అదానీ వ్యవహారంలో స్పీకర్‌కు అన్ని ఆధారాలు ఇచ్చానని,  తన లండన్‌ ప్రసంగంపై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారని, స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు తనకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారని అన్నారు. తాను ఎవ్వరికీ భయపడనని, తనపై అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపినా తగ్గేదేలే.. ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని, ఐ డోంట్ కేర్.. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా అంతా జరుగుతోందని రాహుల్ మండిపడ్డారు. అటు రాహుల్ కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు అందరూ రాజీనామాలకు సిద్ధమవుతున్నారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version