టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలింది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏం చేసిందని ప్రశ్నిస్తుందని… ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. టీఆర్ఎస్ పది పైసల పనులు చేసి వంద రూపాయల ప్రచారం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీది గ్రాఫిక్స్ పాలన అని విమర్శించారు.
టీఆర్ఎస్ పది పైసల పనులు చేసి… వంద రూపాయల ప్రచారం చేసుకుంటోంది: జగ్గారెడ్డి
-