నోయిడాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శంచడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే యమునా హైవే ఎక్స్ ప్రెస్ వద్దకు రాహుల్ గాంధీ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకునడంతో.. వారు కార్యకర్తలతో కలసి కాలినడక వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో రాహుల్ కిందపడిపోయాడు.
పోలీసులు లాఠిచార్జ్ చేశారని… నన్ను తోసేసి కిందపడేసింది కూడా పోలీసులే అని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో మహిళలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే రోడుప్పై నడావాలా..? అన్నారు. సామన్యులకు నడిచే హక్కులేదా.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తనకు వివరించాలన్నారు.