రాహుల్ రాక… రేవంత్ స‌క్సెస్ అయిన‌ట్లేనా ?

-

దేశ రాజకీయాలు ఎలా ఉన్నా.. పీకే ఏం చేస్తారో అన్నది పక్కన పెడితే..మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నెలకొంది. వచ్చే నెల 5, 6 తేదీల్లోరాష్ట్రంలోరెండు రోజుల పాటు రాహుల్‌గాంధీ పర్యటించనుండటంతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వరంగల్‌లో భారీ సభ నిర్వహణకు పార్టీ నాయకత్వం సమయాత్తమవుతోంది. రాహుల్ పర్యటన నేపథ్యంలోనే అసమ్మతి నేతలు కూడా ఒక్కసారిగా తమ నోళ్లు మూసేశారనే వాదన వినిపిస్తోంది. కొద్దిరోజులుగా ఏ నేత కూడా పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నోరెత్తకపోవడమే ఇందుకు నిదర్శనం. దాదాపు తిరుగుబాటు నేతల నోళ్లకు తాళాలు పడ్డాయి.


నిజానికి మరోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణపైనా మరింతగా ఫోకస్ పెట్టాల్సింది. ప్రజల మధ్య తిరగాల్సింది. వారితో మమేకం అవ్వాల్సింది. వారి సాధకబాధకాలను తెలసుకుని మేమున్నామనే భరోసాను ఇవ్వాల్సింది. కానీ ఆ దిశగా రాహుల్ గాంధీ ఎప్పుడూ కదిలిన దాఖలాలు లేవు. చివరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నరాష్ట్రాల్లోనూ ఆయన తిరగాడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు మూడు సీట్లు కట్టబెట్టారు. ఒక విధంగా ఇది పెద్ద విజయమే. ఈ ఎన్నికల్లో మరింత కష్టపడితే మరో రెండు సీట్లు కూడా గెల్చుకునేది. కానీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, సరైన వ్యూహం లేకపోవడంతో చేజేతులా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను టీఆర్ ఎస్, బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారంలో ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. కానీ.. రాహుల్ గాంధీ మాత్రం రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. నువ్వానేనా అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. నేతలు సై అంటే సై అని సవాలు విసురుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం మాత్రం సోయిలోనే లేకుండాపోయింది. ఒక్క రేవంత్ రెడ్డి తప్ప మిగతా నేతలు ఎవ్వరూ కూడా మాకేం పట్టి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా అంతర్గత కుమ్ములాటలు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతోనే సరిపోతోంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఇది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజయంగానే భావించవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.

రాహుల్ రాకతో కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా ఉండేందుకు, కదిలేందుకు మార్గం సుగమం అయ్యిందని అంటున్నారు. రాహుల్ ప్రకటన వివరాలు వెల్లడికాగానే సీనియర్ నేతలందరూ ఏదో ఒక రీతిలో అటు అధికార టీఆర్‌ఎస్, బీజేపీపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ విరుచుకుపడుతున్నారని గుర్తు చేస్తున్నారు. రాహుల్ దఈష్టిలో పడేందుకు యత్నిస్తున్నారని, తద్వారా పార్టీ బలోపేతానికి పరోక్షంగా సహకరిస్తున్నారని చెబుతున్నారు. నిజానికి.. వరస ఉప ఎన్నికల ఫలితాలతో నీరసించిపోయిన కాంగ్రెస్ కు రాహుల్ పర్యటన గ్లూకోజ్ ఎక్కించడం వంటిదేనని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version