రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఇక బోగీలే ఆస్పత్రులు…!

-

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే భోగీలలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగిపోయిన రైళ్ల బోగీలను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా ఇవ్వాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సరైన వైద్య సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా వైద్యసదుపాయలను అందించే అవకాశాలు ఉంటాయని… దీనికి కారణం దేశవ్యాప్తంగా రైల్వేశాఖ విస్తరించి ఉందని, ప్రతిరోజూ 13వేలపైగా రైళ్లు నడిచే భారత్ లో.. రైళ్లను ఆస్పత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఈ కోచ్ లలో టాయిలెట్లు కూడా ఉన్నందున ఐసోలేషన్ వార్డులుగా కూడా ఉపయోగించవచ్చని సూచనలు చేస్తున్నారు. అలాగే రైళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించే అంబులెన్సులను కూడా ప్రభుత్వానికి అందించవచ్చని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే శాఖ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దీనికి మోడీ సర్కార్ కూడా అంగీకారం తెలిపింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version