రైల్వే స్టేషన్ లోనే అమ్మాయిని రేప్ చేసిన రైల్వే ఉద్యోగులు

-

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రధాన రైల్వే స్టేషన్ లో దారుణ ఘటన జరిగింది. స్టేషన్‌ లో ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 22 ఏళ్ల యువతిపై ఇద్దరు రైల్వే అధికారులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మాట్లాడుతూ “ప్రధాన నిందితుడు 45 ఏళ్ళ రాజేష్ తివారీ సెక్యూరిటీ కౌన్సెలర్ గా పని చేస్తున్నాడు. భోపాల్ రైల్వే డివిజన్‌ లో విపత్తు నిర్వహణ ఇన్‌ఛార్జిని అరెస్టు చేసామని చెప్పారు.

మరో రైల్వే అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు భోపాల్ రైల్వే పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఆర్‌పి) హితేష్ చౌదరి తెలిపారు. తివారీ తన ఫేస్‌ బుక్‌ లో ఆమెతో స్నేహం చేసి తనకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి భోపాల్‌కు ఆహ్వానించినట్లు ఉత్తరప్రదేశ్‌లోని మహోబ్‌లో నివసిస్తున్న మహిళ పోలీసులకు తెలిపింది. ఆమె వచ్చినప్పుడు, తివారీ భోపాల్ ప్రధాన స్టేషన్‌ లోని వెస్ట్ సెంట్రల్ రైల్వే కార్యాలయం మొదటి అంతస్తులోని ఒక గదిలో ఆమెను ఉంచాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి రేప్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version