రకుల్ ప్రీత్ సేఫ్ అంట… ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు!!

-

గతకొన్ని రోజులుగా ముంబై డ్రగ్స్‌ కేసు విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలకు సంబందించిన హీరోయిన్స్ కు నార్కో‌టిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సీ.బీ) విచారణకు పిలుస్తున్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం రాజకీయ రంగుపులుముకుంది!!

అవును… ముంబై డ్రగ్స్‌ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్న సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ తో తెలంగాణ ప్రభుత్వంలోని “పెద్ద”లకు “సన్నిహిత సంబంధాలు” ఉన్నాయనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి! ఈ క్రమంలో… సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ‌కుమార్‌ ఆరోపించారు.

ఇందులో భాగంగా మరింత వాయిస్ పెంచిన సంపత్… ముంబై డ్రగ్స్‌ మాఫియా కేసులో రకుల్ ‌ప్రీత్‌ సింగ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని.. ఆమెకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకూ సన్నిహిత సంబంధాలూ ఉన్నాయని.. హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో లోతైన విచారణ జరిపితే ప్రభుత్వ పెద్దల బాగోతాలు బయటపడతాయని చెబుతున్నారు! మరి రకుల్ వ్యవహారం రాజకీయరంగు కూడా పులుముకుంటున్న నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, మరెలాంటి విషయాలు కాలగర్భంలో కలిసిపోతాయి అనేది వేచి చూడాలి!

కాగా… కేంద్ర ప్రభుత్వ పథకమైన “భేటీ పడావో, భేటీ బచావో” పథకానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌ గా రకుల్ ‌ప్రీత్‌ సింగ్‌ పనిచేస్తున్న సంగతి తెలిసిందే!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version