తెలంగాణలో రేపు, ఎల్లుండి రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఝార్ఖండ్ & పరిసర ప్రాంతాలలో నిన్న ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణా నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవి. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నవి. రాగల 3 రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ అల్పపీడనము వల్ల ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షం తెలంగాణాలో కొన్ని జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈరోజు, రేపు (15,16వ తేదీలు) ఒకటి రెండు ప్రదేశాల్లో ఒకటి రెండు ప్రదేశములలో భారీ వర్షాలు పడే అవకశాలున్నాయి. తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైరుతి రుతువనాలు త్వరగా రావడంతో తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించింది.