అల్పపీడన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ వర్షాలు పడననున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర దక్షిణ ద్రోణి, మధ్య ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు, విదర్భ తెలంగాణ రాయలసీమ మీదుగా ఏర్పడింది.
ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉంది. జులై 21న వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు Lat 17°N అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 3.1 కిమీ నుండి 5.8 కిమీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉన్నది.
దీని ప్రభావం కారణంగా…. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు వున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే… తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో దాదాపు వారం రోజుల వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.