Breaking : నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. తాజా హెచ్చరిక

-

ఇప్పటికే తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించగా మరికొద్ది రోజులపాటు రాష్ట్రాన్ని వదిలేలా లేవు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా గ్రామాలు వరదనీటిలోనే ఉన్నాయి. భద్రాచలంలో ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. సాయం కోసం వేలాది మంది వరద బాధిత ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. నేడు భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమిపైకి వచ్చింది. సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.

దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వాయువ్యవ బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version