వెదర్‌ అప్డేట్‌ : తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన

-

తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొనిఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నైరుతి రుతుపవనాల తిరుగమనం చివరి దశకు చేరడంతో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ క్రమంలో వాతావరశాఖ కీలక సమాచారం అందించింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది.

రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని, అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రాగా.. జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. జులై చివరివారంలో వానలు దంచికొట్టాయి. ఆగస్టులు పెద్దగా కువరకపోయినా.. సెప్టెంబర్‌లో అడపాదడపా వర్షాపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలోని 18 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా.. మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు సోమవారంతో రాష్ట్రాన్ని వీడడంతో అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version