హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. వేసవి కాలంలో మండుటెండలతో ఇబ్బందిపడుతున్న నగర వాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం (ఏప్రిల్ 17) న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్ల వాన కూడా పడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన దంచి కొట్టింది. నాంపల్లి, హైకోర్టు, లక్డీకపూల్, ఆబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, బేగంబజార్, సుల్తాన్ బజార్, కోఠీ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా చంచల్ గూడ, సైబాదాద్, చంపాపేట్, హిమాయత్ నగ్, బాలాపూర్, కర్మన్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, చార్మినార్, రాజేంద్ర నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ లో లో వానా దంచికొట్టింది.
కాగా ఉదయం నుంచి ఎండలతో విలవిలలాడిన నగర ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభించినట్లైంది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. దాంతో వాహనాలు అద్దాలు స్వల్పంగా డామేజ్ అయ్యాయి. హైదరాబాద్ నగర శివారుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ పలు చోట్ల వర్ష ప్రభావం ఉన్నట్లు వాతవరణ శాఖ తెలిపింది.