ఒక్కసారిగా చల్లబడ్డ భాగ్యనగరం.. పలుచోట్ల వర్షం

-

హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి, తెల్లాపూర్‌, నిజాంపేట, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, గాజులరామారం, కూకట్‌పల్లి, చింతల్‌, బాలానగర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, కొంపల్లి, అల్వాల్, బొల్లారం, యాప్రాల్‌, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. ఇదిలావుంటే, రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో అలెర్ట్ జరీ చేసింది. హైదరాబాద్‌ నగరంతో పాటు నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version