తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఉత్తర ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాలలో ఉన్న వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు వాయువ్య ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాలలోని తూర్పు మధ్య ప్రదేశ్ లలో కొనసాగుతుంది.
ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రాగల 12 గంటలలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రదేశం వరకు సగటు సముద్రం నుండి 1.5 కిమీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.